Suspicious death of a person: నెల్లూరు నగరంలోని గౌతమ్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతన్ని ఎక్కడో హతమార్చి గోనె సంచిలో చుట్టి రామచంద్ర మిషన్ సమీపంలో పడేశారని పోలీసులు భావిస్తున్నారు. మృతుని చొక్కా జేబులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడుహైదరాబాదుకు చెందిన వ్యక్తి అని.. అతడు కొంతకాలంగా బుచ్చిలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా హత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దర్గామిట్ట పోలీసులు పేర్కొన్నారు.
నెల్లూరులో కలకలం.. గోనె సంచిలో వ్యక్తి మృతదేహం - man suspicious death
Suspicious death of a person: నెల్లూరులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహాన్ని దుండగులు గోనెసంచిలో చుట్టి పడేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Suspicious death