నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. ఇటీవల నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కార్యక్రమానికి అతను హాజరయ్యారు. విషయం తెలిసినా కూడా.. ఆయన గోప్యంగా ఉంచారు. దాని తర్వాత ఎన్నో సమావేశాల్లో పాల్గొని చాలామందిని కలిశారు. ఆ కార్యక్రమానికి మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని అధికారులూ పాల్గొన్నారు. కరోనాపై కనీస జాగ్రత్త వహించకుండా విధులు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి పనిచేశారు. నెల్లూరులో ఐసోలెషన్‌లో ఉన్న అభ్యర్ధి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు.. అతడిని క్వారంటైన్లో ఉంచారు.
కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిసి.. గోప్యంగా ఉంచి...!
బాధ్యత కలిగిన వృత్తిలో ఉంటూ.. కనీస భాద్యత వహించలేదు అతను. కరోనా వ్యక్తిని కలిసిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎన్నో సమావేశాలకు హజరై.. ఎంతో మందిని కలిశారు. మరి ఇప్పుడతన్ని ఏం చేశారు..?
suspect of corona Nellore Superintendent was in Quarantine