ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుఫాన్ ప్రభావంతో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు - నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాన్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి నివర్ తుఫాన్ గా మారింది. ఫలితంగా నెల్లూరు జిల్లా కావలిలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ 20 మీటర్ల ముందుకు అలలు వస్తున్నాయి.

నివర్ తుఫాన్ ప్రభావంతో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు
నివర్ తుఫాన్ ప్రభావంతో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు

By

Published : Nov 24, 2020, 10:35 PM IST

నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట, కొత్తసత్రం సముద్ర తీర ప్రాంతంలో అలల ఎగిసిపడుతున్నాయి. నివర్ తుఫాన్ బలపడటంతో 20 మీటర్ల వరకు సముద్రపు అలల ముందుకు వస్తున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రపు ఒడ్డున ఉన్న బోట్లు వలల సురక్షిత ప్రదేశాలకు తరలించనున్నారు. నివర్ తుఫాన్ పై కావలి ఆర్డీఓ శ్రీనివాసులు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details