ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుందర సింహపురిగా తీర్చిదిద్దుతాం' - నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు.నగరాన్ని సుందర సింహపురిగా తీర్చిదిద్దుతామని మంత్రి వ్యాఖ్యనించారు.

పనులు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

By

Published : Feb 14, 2019, 5:05 PM IST

సుందర సింహపురిగా తీర్చిదిద్దుతా : మంత్రి నారాయణ
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలో నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్ ,భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాల వల్ల దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో తిరిగి నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతినిత్యం 5750 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు నగరాన్ని సుందర సింహపురిగా తీర్చిదిద్దుతామన్నారు.

పనులు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

ABOUT THE AUTHOR

...view details