ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు చెల్లించాలని.. కార్మికుల అర్థనగ్న ప్రదర్శన - Semi-nude Performance news

ఏడేళ్లుగా తమకు జీతాలు చెల్లించడం లేదని కోవూరు చక్కెర కర్మాగారం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇద్దరు కార్మికులు క్రేన్​లపైకి ఎక్కి నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.

suger cane workers Semi-nude Performance
జీతాలు చెల్లించాలని కార్మికులు అర్థనగ్న ప్రదర్శన

By

Published : Jun 1, 2020, 7:50 PM IST

నెల్లూరు జిల్లా కోవూరు చక్కెర కర్మాగారం వద్ద కార్మికులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ఆగ్రహించిన కార్మికులు పరిశ్రమ వద్ద అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల రోజులు జీతాలు రాకుంటే ఉద్యోగులు ధర్నాలు చేస్తారు, అలాంటిది ఏడేళ్లుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details