నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిలో సూదలగుంట షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు సమావేశం నిర్వహించారు. తమ దగ్గర చెరుకు తీసుకొని ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు పెడతాం' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
చెరుకు తీసుకొని ఏడాదిన్నర అవుతున్నా బకాయిలు చెల్లించకపోవడంపై సూదలగుంట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.

Sudhalagunta Sugar Factory farmers demand for dues in nellore district
నెల్లూరు, కడప జిల్లాల్లో దాదాపు మూడు వందల మంది రైతులకు... తొమ్మిది కోట్ల బకాయిలు చెల్లించాలని వారు తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా.. వారూ స్పందించడం లేదని అంటున్నారు. యాజమాన్యం బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్'లో శ్రియ.. ఏ పాత్రకోసమో!