ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూపర్​ మార్కెట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు - sudden raids by food safety officials on supermarkets news

మర్రిపాడులో సూపర్​ మార్కెట్​లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. లైసెన్స్​ లేకుండా దుకాణాలు నిర్వహిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

sudden raids by food safety officials
తనిఖీలు నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు

By

Published : Jan 5, 2021, 11:56 AM IST

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని సూపర్ మార్కెట్​లపై ఆహార భద్రత అధికారులు మెరుపు దాడులు చేశారు. శ్రీ దుర్గా సూపర్ మార్కెట్ కు లైసెన్స్ లేదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఆహార పదార్థాలపై తయారీ, గడువు ముగింపు తేదీలు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారంటూ ఆగ్రహించారు.

మరిన్ని షాపులను తనిఖీ చేసి.. నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న కొన్నింటిని మూసేశారు. లైసెన్స్ లు లేకుండా షాపులు నిర్వహిస్తే.. ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు.. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్, తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details