నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శేషగిరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ వాలంటీర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేటాయించిన ఇళ్లను ప్రతిరోజూ వాలంటీర్లు సందర్శిస్తున్నారా..? సందర్శించిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు...? ఆ ఇంటిలోని ప్రతి ఒక్కరి పేరు, వారు చేస్తున్న వృత్తిని నమోదు చేసుకుంటున్నారా....? అనే విషయాలను కలెక్టర్ వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.
అనికేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ శేషగిరిబాబు - Sudden checking of Collector
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ శేషగిరి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ వాలంటీర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని.. ప్రతి వాలంటీర్ తనకు కేటాయించిన ప్రతి ఇంటినీ సందర్శించాలన్నారు. ఇంట్లో ఉంటున్న వారి అన్ని వివరాలు పుస్తకంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు..అనే సమాచారం వాలంటీర్ల దగ్గర ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి ఇంటిలోనూ చదువుకునే విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలు వాలంటీర్లు సేకరించాలని ఆదేశించారు. అలా సేకరించిన వివరాలను రికార్డు చేయాలని... ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని... వాటిని చదువుకుంటున్న విద్యార్థులకు వివరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయో... ప్రజలని అడిగి తెలుసుకున్నారు.