నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో... హోటల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్న గండికోట శ్రీకాంత్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి చెల్లెల్లు రాధిక ఆరోపించింది. కిందటి ఎన్నికల్లో తెదేపా తరుఫున ఏజెంట్గా పని చేశాడని... దొంగ ఓట్లు వేస్తున్నారని వైకాపా నేతలను ప్రశ్నించినందుకే ఇలా జరిగిందని వివరించింది.
యువకుడి ఆత్మహత్య... వేధింపులే కారణామా..? - latest crime news of nellore district
నెల్లూరు జిల్లా దగదర్తి మండల కేంద్రంలో... గండికోట కార్తీక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికార పార్టీ వేధింపులు, పోలీసు కేసుల వల్లే ఆత్మహత్యకు చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు.
sucide-death-of-young-man-in-nellore-district
కార్తీక్ మృతితో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక తెదేపా నాయకులు కార్తీక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు... ఆత్మహత్యపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని... కుటుంబ కారణాలతోనే కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి : తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్