ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరకొరగా వసతులు - మధ్యాహ్న భోజనం చేయడానికి చోటు లేక ఇక్కట్లు - నెల్లూరు విద్యార్థుల సమస్యలు

Students Due To Suffering Lack Of Proper Facilities: నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధుల పరిస్థితి చూసిన ఎవరైనా సరే అయ్యో పాపం అంటారు. పాఠశాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు సరైన వసతి లేక నేల మీద, చెట్ల కింద కూర్చుని విద్యార్థుల భోజనం చేస్తున్నారు. ప్రభుత్వం పసి పిల్లల సమస్యలను పరిష్కరిస్తుందా!

students_due_to_suffering_lack_of_proper_facilities
students_due_to_suffering_lack_of_proper_facilities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 1:52 PM IST

అరకొరగా పాఠశాల వసతులు- మధ్యాహ్న భోజనం చేయటానికి సరైన ప్రదేశం లేక విద్యార్థుల అవస్థలు

Students Due To Suffering Lack Of Proper Facilities: ఎండైనా, వానైనా సరే ఆ పాఠశాలలోని విద్యార్థులు భోజనం చేయాలంటే ఆరుబయటే తినాలి. అరకొర వసతులతో పాఠశాలలో విద్యనభ్యసించాల్సి వస్తోందని విద్యార్థులు సమస్యల చిట్టాలు విప్పారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట సమీపంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో ఉన్న దయానీయమైన పరిస్థితి. నెల్లూరు నగర నడిబొడ్డులో ఉన్న ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (RSR Municipal High School)విద్యార్ధుల పరిస్థితి చూసిన ఎవరైనా సరే అయ్యో పాపం అంటారు. పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం చేసేందుకు సరైన వసతి లేక మైదానంలో, చెట్ల కింద కూర్చుని అక్కడి విద్యార్థుల భోజనం చేస్తున్నారు.

Rain Water Stored In School Ground:ఇక వర్షం వస్తే ఆ పాఠశాలలోని విద్యార్థుల దయనీయ పరిస్థితి అంతా ఇంతా కాదు. గాలికి దుమ్ము దూళి పడుతున్నా భోజనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. వర్షంలోనే గొడుగులు పట్టుకుని కొందరైతే తింటున్నారు. మరికొందరు విద్యార్థులు క్యారేజిలు సర్థుకుని తరగతిగదుల్లోకి పరుగులు తీశారు. కలుషిత వాతావరణంలో చిన్నారులు భోజనాలు చేస్తున్నారు సరైన మౌలిక సదుపాయల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతన్నామని విద్యార్థులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వర్షం వస్తే రోజూ ఇదే పరిస్థితి అని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదువు, విశ్రాంతి, భోజనాలు తరగతి గదులే సర్వస్వం - గురుకులాల్లో జగనన్న వసతి కష్టాలు

Not Proper Facilities In RSR Government School: పాఠశాలలో ఉన్న విద్యార్థులంతా ఇలాగే ఇబ్బంది పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. వర్షపు నీరు నిలిచి తరగతి గదుల వరకు దుర్వాసనలు వస్తున్నాయని విద్యార్ధులు తెలిపారు. అపరిశుభ్ర మరుగుదొడ్లతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. దోమలు తరగతి గదుల్లోకి ఎక్కువగా వస్తున్నాయని వాటి వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నామని అంటున్నారు.

Nellore Students Problems: పెద్దగా వర్షం కురిస్తే నీళ్లలో నుంచి నడుచుకుంటూ తరగతి గదుల్లోకి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. రోడ్డును మైదానానికి దిగువ చేయాలని అప్పుడు వర్షపునీరు నిల్వ ఉండదని విద్యార్ధులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా కాలం వెల్లదీస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాల ఆవరణలో రోడ్డు వేసి, భోజనం చేసేందుకు వీలుగా ఉండేలా చూడాలని కోరుతున్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు ప్రభుత్వానికి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రచారాలు కాదు సార్ - పథకాలను అమలు చేయండి! సకాలంలో ఫీజు చెల్లింపులు కాకపోవడంతో చదువులు ఆగిపోతున్నాయ్!

ABOUT THE AUTHOR

...view details