నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్యవోలు ప్రాథమిక పాఠశాలలో ఓ భవనం పైకప్పు పెచ్చులూడి పడింది. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. తరగతి గది శిథిలావస్థకు చేరుకోవడమే తరచుగా ఇలాంటి ఘటనలకు కారణం అవుతోందని.. ఉపాధ్యాయులు నీలిమ, సునంద ఆవేదన వ్యక్తం చేశారు.
భవనం ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడాల్సి వస్తోందని వారు వాపోయారు. విద్యాశాఖాదికారులు వెంటనే స్పందించి అదనపు భవన నిర్మాణాలకు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.