Student Dead Body: నెల్లూరు జిల్లా రాపూరులో విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. మిత్రులందరూ కలిసి విహారయాత్రకు జలపాతం వద్దకు వెళ్లగా.. అందులో ఒక యువకుడు జలపాతంలో గత్లంతై మృతిచెందాడు. రాపూరు ఘాట్ రోడ్డు సిద్ధేశ్వరకోనలోని జలపాతంలో ఈ ఘటన జరిగింది. గూడూరుకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు శుక్రవారం జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో దిగి ఈత కొడుతుండగా వెంకట కల్యాణ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. దీంతో విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థాలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకి కోసం గాలించారు. అచూకీ లభించకపోవటంతో మరుసటి రోజూ గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ జలపాతం వద్ద గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
సిద్ధేశ్వరకోనలోని జలపాతంలో గల్లంతైన విద్యార్థి మృతి.. - జలపాత ఘటనలు
Dead Body In Waterfall: సరదాగా జలపాతం వద్దకు వెళ్లి ఈత కొడుతుండగా ఒకరు గల్లంతయ్యారు. అతని మృతదేహం మరుసటి రోజు దొరికింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
![సిద్ధేశ్వరకోనలోని జలపాతంలో గల్లంతైన విద్యార్థి మృతి.. Dead Body In Waterfall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16974909-425-16974909-1668860586301.jpg)
జలపాతంలో గల్లంతై విద్యార్థి మృతి