నెల్లూరు జిల్లాలో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తొంది. తాజాగా అయిదు కొత్త కేసులు నమోదైన కారణంగా.. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 101కి చేరింది. అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో పాజిటివ్ కేసులు వస్తుండటంతో కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగే వాణిజ్య సముదాయాలను మూసివేశారు. కొన్ని దుకాణాలను నవాబుపేట మార్కెట్ గోదాముకు తరలించారు.