శ్రీకాకుళం జిల్లా జలుమూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో యువకులంతా కలిసి సందడి చేశారు. ఆముదాలవలస జూనియర్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
కడప జిల్లా..
జమ్మలమడుగులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పలు పోటీలు సరదాగా సాగాయి. నగరంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు రకరకాల ముగ్గులు వేశారు. వంటల పోటీల్లో 30 మంది మహిళలు పోటీపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా..
క్రీడలతోనే రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలో సీఆర్సీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి మహిళల, రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని చాటే సత్తా క్రీడాకారులకు ఉందని సబ్ కలెక్టర్ కేఎస్.విశ్వనాథన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ పరిధి రుస్తుంబాద గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ క్రీడలతో పట్టుదల పెరుగుతుందన్నారు.
అనంతపురం జిల్లా..