నెల్లూరు జిల్లాలో కరోనా స్థితిగతులపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని సమావేశం నిర్వహించారు. జిల్లాలోని కొవిడ్ కేర్ కేంద్రాలు, రీజనల్ కొవిడ్ సెంటర్ జీజీహెచ్, నారాయణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు పెరిగినందున కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. బాధితులకు సహాయం అందించేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్స్‌తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా మృతుల పట్ల మానవత్వాన్ని చూపాలని కోరారు.