లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. నగరంలోని రెండో డివిజన్లో జన్నత్ హుస్సేన్ నగర్‌లోని 500 కుటుంబాలకు పది కేజీల బియ్యం, తొమ్మిది రకాల కూరగాయలను అందించారు.
నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఆపన్నహస్తం - people problems with lockdown
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు, అన్నార్తులకు పలుపురు సహాయం చేస్తున్నారు. తమ వంతు తోడ్పాటు అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా ఓట్లేసి గెలిపించిన ప్రజల ఇబ్బందులను గమనించిన ఓ ఎమ్మెల్యే వారికి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
![నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఆపన్నహస్తం Sridhar Reddy is an MLA who distributes vegetables in Nellore for poor people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6779807-987-6779807-1586789300671.jpg)
నెల్లూరులో కూరగాయలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి