Khaja Naib Rasool Festival in AP:నెల్లూరు జిల్లా ఏ.ఎస్ పేట ఖాజానాయబ్ రసూల్ గంధ మహోత్సవంలో దొంగలు హల్‌చల్ చేశారు. సుమారు 200 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా.. దొంగలు మాత్రం రెచ్చిపోయరు. జనాలు భారీ సంఖ్యలో రావటాన్ని అదనుగా చేసుకుని 40 ఫోన్లు, పర్సులు దొంగిలించారు. ఖాజానాయబ్ రసూల్ గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గంధాన్ని దర్గాకు తీసుకువచ్చి ప్రార్థనల అనంతరం గంధాన్ని పంపిణీ చేశారు. గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
ఖాజా నాయబ్ రసూల్ గంధమహోత్సవంలో దొంగల చేతి వాటం - Biography Of Khaja Nayab Rasool
నెల్లూరులో ఖాజా నాయబ్ రసూల్ 249వ గంధమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. భారీగా జనాలు రావడంతో దొంగలు రెచ్చిపోయారు. భక్తుల నుంచి సుమారు 40 ఫోన్లతో పాటుగా పర్సులను దొంగిలించారు.
![ఖాజా నాయబ్ రసూల్ గంధమహోత్సవంలో దొంగల చేతి వాటం Shri Khaja Naib Rasool Festival in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16731383-628-16731383-1666583167734.jpg)
శ్రీ ఖాజా నాయబ్ రసూల్
ఘనంగా శ్రీ ఖాజా నాయబ్ రసూల్ 249వ గంధమహోత్సవం