ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు - ఈరోజు నెల్లూరు జీజీహెచ్​ తాజా అప్ డేట్స్

బ్లాక్ ఫంగస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. జిల్లాల్లో నమోదవుతున్న కేసుల దృష్ట్యా వైద్యాధికారులు అప్రమత్తం అవుతున్నారు. నెల్లూరులోని జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌ బాధితులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

Special Ward for Black Fungus Victims
జీజీహెచ్​లో బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డు

By

Published : May 27, 2021, 9:04 AM IST

నెల్లూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 10 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి.

అయితే.. ఇదేమీ అంటువ్యాధి కాదని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని 34 కొవిడ్ ఆస్పత్రుల్లో 3,175 పడకలు, 2,248 మందికి చికిత్స అందిస్తుండటంతో.. బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details