ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 24, 2021, 10:25 PM IST

ETV Bharat / state

ఆత్మకూరు చెరువుకట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణానికి.. నిపుణుల పరిశీలన

నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల ప్రారంభం కోసం ప్రత్యేక బృందం చెరువు కట్ట ప్రాంతంలో పర్యటించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో ట్యాంక్ బండ్ నిర్మాణ వ్యయం అంచనా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అధికారుల బృందం తెలిపింది.

Special team review on tank bund construction
ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం ప్రత్యేక బృందం పర్యటన

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల ప్రారంభంపై అధికారుల ప్రత్యేక పరిశీలన వేగవంతంగా సాగుతోంది. చెరువు కట్టపై ట్యాంక్ బండ్ నిర్మాణం చేసేందుకు స్థల పరిశీలన కోసం ఇటీవల విజయవాడ నుంచి రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి వెళ్లారు. తాజాగా బుధవారం మరో రాష్ట్ర ప్రత్యేక బృందం ఆత్మకూరు చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించింది. అర్బన్ గ్రీన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ చంద్రమోహన్ రెడ్డి వారి సిబ్బంది చెరువు కట్టను పరిశీలించారు.

ఆధునిక హంగులతో..

ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం స్థల సేకరణ అనంతరం చెరువు గట్టుపై వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లల ప్లే గ్రౌండ్, ప్రత్యేక ప్లాట్ ఫామ్ నిర్మాణం, బోటింగ్ నిర్మాణం తదితర పనులకు కావలసిన నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. చెరువు గట్టుపై సుమారు ఒక కిలో మీటర్ల మేర ఈ ట్యాంక్ బండ్ నిర్మాణం ఉండవచ్చని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

ప్రత్యేక బృందం వెంట ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (పబ్లిక్ హెల్త్) ఏ.వి. వెంకటేశ్వర్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్, మున్సిపల్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర సచివాలయ సిబ్బంది హాజరయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో ట్యాంక్ బండ్ నిర్మాణ వ్యయం అంచనా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని బృందం తెలిపింది.

ఇదీ చదవండి:

నాయుడుపేట పురపాలక ఛైర్​పర్సన్​గా బాధ్యతలు చేపట్టిన దీపిక

ABOUT THE AUTHOR

...view details