రెండో సబర్మతిగా పేరొందిన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసింది. దీనిపై ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన వ్యక్తులకు, తపాలా శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆశ్రమం పేరుపై పోస్టల్ కవర్‌ను విడుదల చేయడం ద్వారా నాటి స్వరాజ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేసినట్లయిందని చెప్పారు. యువత.. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను, దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకుని నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంపై ప్రత్యేక తపాలా కవరు - vice presinden latest news
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారతీయ తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవరును విడుదల చేసింది. దీని ద్వారా నాటి స్వరాజ్య పోరాట స్ఫూర్తిని నేటి యువతకు తెలియజేసినట్లయిందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
సత్యాగ్రహ ఆశ్రమంపై ప్రత్యేక తపాలా కవరు