ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'క్వారంటైన్​ కేంద్రాల్లో ముస్లింలకు ప్రత్యేక మెను'

నెల్లూరు జిల్లాలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ అన్నారు. రంజాన్ సందర్భంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు ప్రత్యేక మెను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

minister anil kumar yadav
minister anil kumar yadav

By

Published : May 1, 2020, 6:22 PM IST

మీడియాతో మంత్రి అనిల్​ కుమార్ యాదవ్

కరోనా సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. కరోనాపై నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా బాధితులు కోలుకుని డిశ్ఛార్జి అవుతుండటం శుభ పరిణామమని మంత్రి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 84 కేసులు నమోదు కాగా, 43 మంది డిశ్ఛార్జ్ అయ్యారని తెలిపారు. మరో పది మంది బాధితులు కోలుకున్నారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ఇంటికి పంపిస్తామన్నారు. రంజాన్ సందర్భంగా క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు ప్రత్యేక మెనూను అమలు చేస్తున్నామన్నారు. లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details