ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా నిర్వహించిన పెద్దల పండుగ.. - నెల్లూరులో పెద్దల పండుగ న్యూస్

ఏటా సంప్రదాయబద్ధంగా సాగే పెద్దల పండుగను నెల్లూరులో వైభవంగా నిర్వహించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు.. చనిపోయిన వారిని తలుచుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండటంతో.. నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Special arrangements for Peddhala Festival in Nellore
ఘనంగా నిర్వహించిన పెద్దల పండుగ..

By

Published : Jan 15, 2021, 3:49 AM IST

ఘనంగా నిర్వహించిన పెద్దల పండుగ..

నెల్లూరులో పెద్దల పండుగ వైభవంగా జరిగింది. మరణించిన కుటుంబసభ్యులు, ఆత్మీయులను తలుచుకుంటూ... ఈ పండుగను నిర్వహించారు. బోడిగాడితోట స్మశాన వాటిక వద్ద సమాధులను నీటితో శుభ్రం చేసి... పూలతో అందంగా అలంకరించి పూజలు నిర్వహించారు. సంక్రాంతికి చేసిన పిండివంటలతో పాటు, మరణించిన వారికి ఇష్టమైన ఆహారం, బట్టలు సమర్పించారు. ఏటా సంప్రదాయబద్ధంగా సాగే ఈ పండుగకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు

ఇదీ చదవండి:

వృద్ధాశ్రమంలో విద్యార్థుల సంక్రాంతి సంబరాలు

ABOUT THE AUTHOR

...view details