పారిశ్రామిక రంగంలోని సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం ప్రారంభించాలని మంత్రి గౌతంరెడ్డి నిర్ణయించారు. వచ్చే నెలలో ఇండస్ట్రీస్ స్పందన కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన చేశారు.
మరోవైపు.. ఏపీ బొమ్మల తయారీ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు. పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ రూపకల్పనకు కార్యాచరణ ప్రారంభించారు. ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు మరింత దగ్గరగా పరిశ్రమల శాఖ పనిచేయాలని భావిస్తోందన్నారు.