నెల్లూరు జిల్లాలో ‘స్పందన’ కార్యక్రమ నిర్వహణను మార్చి చివరి వారం నుంచి నిలిపివేశారు. దాంతో అర్జీదారులు అధికారుల వద్దకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అనంతరం కొద్ది రోజులకు ప్రభుత్వం సమస్యపై దృష్టి పెట్టి ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు అవకాశం కల్పించినా.. బాధితులకు అవగాహన లేకపోవడం.. వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం దొరక్కపోవడం.. అదే సమయంలో నిర్దేశిత వెబ్‌సైట్ పనిచేయకపోవటంతో బాధితులు గోడు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది. పట్టాదారు పాసుపుస్తకాల నుంచి మ్యుటేషన్లు, అడంగల్ ధ్రువీకరణ పత్రాలకు అవసరం ఉంటోంది. సచివాలయాల ద్వారా సేవలు అందుతున్నా సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదన్నది నిజం. ఈ స్థితిలో ప్రభుత్వం కరోనా నిబంధనలు అమలు చేస్తూనే... ప్రత్యామ్నాయ మార్గాల్లో స్పందన నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
త్వరలోనే అందుబాటులోకి..
కరోనా కారణంగా స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థనలు ఇచ్చేందుకు అవకాశం కల్పించగా.. ఇప్పుడు ఆ వెబ్‌సైట్ కూడా పనిచేయడం లేదు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదేశాలు రాగానే పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభిస్తాం. - - ఎం.వి.రమణ, డీఆర్వో, నెల్లూరు
నేనూ.. నాలాగే మరికొందరు...