సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో మోసాలకు పాల్పడిన ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వివరించారు. నెల్లూరు నగరం వేదాయిపాలెంలో మైఖేల్ సుమన్, రవి, శ్రీను కలసి ఫిబ్రవరిలో రిత్విక్ ఎన్క్లైవ్ వెల్ పే ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ను ఐత్రీ సోల్యూషన్స్ వద్ద నుంచి కొనుగోలు చేసి ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి వినియోగదారుల నుంచి డిపాజిట్ సేకరించారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా ఆన్లైన్లో 12,600 మంది వద్ద ఏడు నెలల్లో రూ. 85 కోట్లు వసూలు చేశారు.
రెట్టింపు పేరుతో వల..
వెల్ పే కంపెనీకి పదివేల రూపాయలు డిపాడిట్ చేస్తే మరుసటి రోజు నుంచి ప్రతి రోజు రూ. 200 కస్టమర్ అకౌంట్లో జమ చేస్తారు. వంద రోజుల్లో కస్టమర్‌కి రెట్టింపు జమ అవుతుంది. ఇటువంటి అనేక స్కీమ్‌లను ఆశ చూపించారు. కొందరు.. ఆశతో రెండు కంటే ఎక్కువ ఐడీలు తీసుకుని రొటేషన్ పద్దతిలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
అనుమతులు లేవు...