నెల్లూరులో దారుణ ఘటన జరిగింది. నగరంలోని బుజబుజ నెల్లూరు ప్రాంతంలో ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా హతమార్చాడు.
Son killed murder: కత్తితో గొంతుకోసి తండ్రిని చంపిన కొడుకు - నెల్లూరు జిల్లా నేర వార్తలు
నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. మద్యానికి డబ్బులివ్వలేదని తండ్రిని కొడుకు పాశవికంగా హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి హతమార్చాడు.
son killed his father
మస్తాన్ అనే వ్యక్తిని అతని కుమారుడు తాజుద్దీన్ కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే తాజుద్దీన్ ఈ పాశవిక చర్యకు దిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Nellore GGH: వైద్య విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన..సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్!