ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయానికి జలకళ

సోమశిల జలాశయం పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండను తలపిస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పైనున్న ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది.

By

Published : Nov 17, 2020, 7:22 PM IST

Somshila reservoir with full of rain water
జలకళను సంతరించుకున్న సోమశిల జలాశయం

నెల్లూరు జిల్లాలో కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు సోమశిల జలాశయం నిండుకుండలా కళకళలాడుతోంది. రిజర్వాయర్​ పూర్తి సామర్థ్యం 77.988 టీఎంసీల నీటితో 330 అడుగుల ఎత్తు కాగా... ప్రస్తుతం 76.2817 టీఎంసీల నీటితో 329. 229 అడుగుల వరకు నీరు చేరింది. జలాశయానికి 15166 క్యూసెక్కులు వరదనీరు వస్తుండగా... 3200 క్యూసెక్కుల నీటిని అధికారులు కండలేరుకు పంపుతున్నారు.

ఇప్పటికే జలాశయలో నీటి ఉద్ధృతి అధికంగా ఉన్న కారణంగా పై తట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగితే క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. పెన్నా పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details