సోమశిల జలాశయానికి 82 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో 16 టీఎంసీల వరద నీరు పెరిగినట్లు వివరించారు. జలాశయం సామర్థం 78 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 73 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. జలాశయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుందనీ.. నేడు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 5,6 గేట్ల ద్వారా డెల్టాకు 30 నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామనీ.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిండుకుండలా సోమశిల జలాశయం - సోమశిల జలాశయం వార్తలు
భారీగా వస్తున్న వరద నీటితో సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. నేడు జలాశయం నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నామనీ.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సోమశిల జలాశయం