ఏపీ హైకోర్టును అమరావతిలో అని నిర్ణయించినప్పుడే సుప్రీంకోర్టుతో పాటు రాష్ట్రపతి కూడా ఆమోదించారని సోమిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టును మార్చలేవని చట్టాలు చెబుతుంటే... హైకోర్టు తరలింపుతో కలిసిన మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం పెట్టేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే దుందుడుకు నిర్ణయాలను రాజ్ భవన్ వ్యవస్థ ఆషామాషీగా తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ఉత్తర్వులివ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయాలు ఎలాంటివో గవర్నర్ తెలుసుకోవాలి: సోమిరెడ్డి - సీఆర్డీఏ బిల్లుపై ఏపీ హైకోర్టు స్టే వార్తలు
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయాలు న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో, లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని స్పష్టం చేశారు.
somireddy on high court stay over 3capitals and crda bill