ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే నాన్​బెయిలబుల్ కేసులా ?' - సోమిరెడ్డి న్యూస్

ఆనందయ్య మందు పంపిణీ కోసం ఎవరి అనుమతితో అప్లికేషన్‌ తయారు చేశారని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆక్షేపించారు. వైకాపా పాలనలో ప్రశ్నిస్తే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

somireddy fire on ycp govt over non-bailable cases
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే నాన్​బెయిలబుల్ కేసులా

By

Published : Jun 7, 2021, 8:19 PM IST

వైకాపా పాలనలో ప్రశ్నిస్తే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై కేసులు నమోదయ్యాయన్నారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ఎవరి అనుమతితో అప్లికేషన్‌ తయారు చేశారని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టారని ఆక్షేపించారు. అప్లికేషన్‌ తయారు చేసిన సంస్థ శేశ్రిత నెల్లూరులో ఉంటే ముత్తుకూరులో కేసు ఎలా నమోదు చేస్తారని నిలదీశారు.

జరుగుతున్న పరిణామాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా..వీలు కావటం లేదన్నారు. గతంలో పోర్జరీ పత్రాలు సృష్టించి తమపై లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. అప్లికేషన్‌ తయారు చేసేందుకు శేశ్రిత సంస్థకు ఎవరు అనుమతి ఇచ్చారో కలెక్టర్​ అయినా ప్రకటించాలని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details