ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం: సోమిరెడ్డి - వైకాపా సోమిరెడ్డి మండిపాటు

నెల్లూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన...వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకోవంటంలో ప్రభుత్వం విఫలం
రైతులను ఆదుకోవంటంలో ప్రభుత్వం విఫలం

By

Published : Nov 30, 2020, 5:06 PM IST

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఆయన...లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా మంత్రులు, ఎమ్మెల్యేలలో చలనం లేదన్నారు. ఉద్యాన పంటలు, యంత్రపరికరాలు ,బిందు తుంపర్ల సేద్యం రాయితీల గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండపడ్డారు.

గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, కడప జిల్లాలో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిందని వాపోయారు. వరి రైతులకు ఎకరానికి రూ.10 వేలు, అరటి, మిరప, తమలపాకు రైతులకు ఎకరానికి రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details