ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎవరెన్ని కుట్రలు పన్నినా.. తెదేపాదే విజయం: సోమిరెడ్డి - నెల్లూరు జిల్లా

రాష్ట్రంలో 1994లో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయనీ.. తిరిగి తెదేపా అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం

By

Published : Apr 7, 2019, 3:48 PM IST

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసిందని సర్వేపల్లి తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ఇసుకపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. మళ్లీ తెదేపా ప్రభుత్వమే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ, కేసీఆర్, జగన్ ఒకటయ్యారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా... తెదేపా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే తిరిగి తమకు అధికారాన్ని కట్టబెడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details