ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు: సోమిరెడ్డి - ఆత్మహత్యాయత్నం చేసిన రైతుకు సోమిరెడ్డి పరామర్శ వార్తలు

నెల్లూరు జిల్లా సంగం మండలం తురిమెల్ల గ్రామ రైతు వెంకటరత్నం ఆత్వహత్యాయత్నం చేశారు. బాధిత కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించారు.

రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు: సోమిరెడ్డి
రైతులకు గిట్టుబాటు ధర లభించడంలేదు: సోమిరెడ్డి

By

Published : Oct 8, 2020, 3:36 PM IST

ఆత్మహత్యాయత్నం చేసిన తురిమెల్ల గ్రామ రైతు వెంకటరత్నాన్ని నెల్లూరు ఆసుపత్రిలో తెదేపా నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రైతుకు అందడంలేదని సోమిరెడ్డి విమర్శించారు. రైతు వెంకటరత్నం గిట్టుబాటు ధర లభించకే ఆత్మహత్యయత్నం చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహణ సరిగాలేదని.. రైతును నాయకులు, బ్రోకర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details