దిగుబడి తగ్గి, మద్దతు ధర దొరక్క నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు పెట్టడం దారుణమని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అన్నదాతల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దిగుబడి తగ్గి రైతులు నష్టపోయారని.. ఒక్కొక్కరికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదన్నారు.
తక్షణమే 170 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటే.. అమాయకులను అరెస్ట్ చేసి వేధించడం సరికాదన్నారు. కొందరు అధికారుల తీరు దారుణంగా ఉందని, వారిని తాము చట్టం ముందు నిలబెడుతామని హెచ్చరించారు.