కరోనా సహాయం కింద ప్రభుత్వం పేదలకు వెయ్యి రూపాయలు ఇచ్చి.. విద్యుత్ చార్జీల పేరుతో 8 రెట్లు అధికంగా వసూలు చేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో తెదేపా నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో కరెంట్ బిల్లు 700 రూపాయలు వస్తే, ఇప్పుడు రూ. 8 వేలు వస్తోందన్నారు. వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయలేకపోతున్నారని.. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం తాగితే పక్షవాతం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు.
'ఫిబ్రవరిలో రూ. 700.. ఏప్రిల్లో రూ. 8వేలా?' - ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలు
వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజలపై ఈ విధంగా భారం మోపడం దారుణమని.. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి