ముఖ్యమంత్రి జగన్పై తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మాజీమేయర్ అబ్దుల్ అజీజ్ సమస్యలపై పరిష్కార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి తోపాటు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నుడా మాజీఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. పరిష్కారం కాని ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే... వాటిని అధికారులకు తెలియజేసి పరిష్కారమయ్యే వరకు పోరాడటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అజీజ్ తెలిపారు.
'రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగం ప్రవేశపెట్టారు'
ముఖ్యమంత్రి జగన్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిందే రాజ్యాంగంగా... వారు చేసిందే చట్టంగా తయారవుతున్నారని ధ్వజమెత్తారు.
'రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగం చేశారు'
కొంతమంది అధికారుల దారుణంగా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చేందుకు వెళ్తే... వాలంటీర్లను కలవమని అధికారులు చెబుతున్నారన్నారు. వాలంటీర్ల దగ్గరికెళ్తే... ఎమ్మెల్యేను కలవమని చెబుతున్నారని పేర్కొన్నారు. భారతదేశ చిత్రపటంలో అమరావతిని చేర్చడం మంచి పరిణామమని.. అందుకోసం కృషి చేసిన ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సోమిరెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: 'అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తారో.. అది వంశీ ఇష్టమే'