క్రికెట్లో క్రీడాకారుల వేలం ఆటగాళ్ల స్థాయిని తగ్గిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్షన్‌లో ఆటగాళ్లను కార్పొరేట్లు కొనడం.. నాటి బానిస వ్యవస్థను గుర్తుకుతెస్తోందన్నారు. భారత్‌లో ఎనలేని విలువ ఉండే క్రికెటర్లను వేలంలో కొనడం అవమానకరమని విచారం వ్యక్తం చేశారు. ఆటగాళ్లను కొనుగోలు చేసి ఆడించే బదులు.. వారి ఆటకు మరో రూపంలో విలువ కట్టాలని సూచించారు. వేలం పాటలు క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు.
'ఆటను వేలంలో కొనడం అవమానకరం' - somi reddy on ipl auction latest news
ఐపీఎల్ ఆక్షన్‌పై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లను వేలంలో కొనడం అవమానకరమని అన్నారు.
somireddy chandra mohan reddy on ipl auction