ఇప్పటికే రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ, బీసీజీలే దండగ అనుకుంటే వైకాపా సర్కార్ మరో అధికారం లేని పవర్ కమిటీని వేసిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏ కమిటీ అయినా రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి జగన్ ముందు నిర్భయంగా చెప్పేవారే లేరని ట్వీట్ చేశారు. అన్నీ జగన్ చుట్టూ తిరిగే కమిటీలేనని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పింది తప్ప ప్రజాభిప్రాయాన్ని రిపోర్టులో పెట్టే దమ్ము ఏ కమిటీకీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ దమ్ము... ఏ కమిటీకి లేదు: సోమిరెడ్డి - రాజధానిపై హై పవర్ కమిటీ
రాజధానిపై హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇవన్నీ జగన్ చుట్టూ తిరిగే కమిటీలేనని ఎద్దేవా చేశారు.
సోమిరెడ్డి