ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది: సోమిరెడ్డి - నెల్లూరులో సీబీఐ విచారణ

CBI Investigation: తెలుగుదేశం నేత మాజీమంత్రి సోమిరెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. మంత్రి కాకాణిపై పెట్టిన కేసుకు సంబంధించిన దస్త్రాలను..నెల్లూరు కోర్టులో దుండగులు చోరీ చేసిన ఘటనపై మాజీమంత్రి సోమిరెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

Somireddy
సోమిరెడ్డి

By

Published : Jan 25, 2023, 8:06 PM IST

Updated : Jan 25, 2023, 9:16 PM IST

CBI Investigation: నెల్లూరు న్యాయస్థానంలో చోరీకి గురైన నకిలీ పత్రాల కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. విదేశాల్లో అక్రమాస్తుల కలిగి ఉన్నానని మంత్రి కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై ఆరోపణ చేసినట్లు మాజీమంత్రి సోమిరెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు న్యాయస్థానంలో చోరీకి గురవడంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. నెల్లూరు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సోమిరెడ్డి మూడోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.

సీబీఐ అనంతకృష్ణన్ రెండు గంటల పాటు సోమిరెడ్డిని విచారించి, వివరాలను నమోదు చేసుకున్నారు. సీబీఐ అధికారులకు పూర్తి వివరాలు తెలియజేశానని, 161 స్టేట్​మెంట్ ద్వారా ఆధారాలు అందించినట్లు సోమిరెడ్డి తెలిపారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం, ఫొటో మార్ఫింగ్, భూ వివాద కేసుల్లో కాకాణి తప్పించుకోలేరని సోమిరెడ్డి చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా చూసే నాయకులను తాము ఇప్పటివరకు చూడలేదన్నారు. జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని సీబీఐ ఆఫీస్​గా మార్చేసిన ఘనత కాకాణికే దక్కుతుందన్నారు. సీబీఐ విచారణ ద్వారా తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.

సోమిరెడ్డి,మాజీ మంత్రి

ఈ రోజు 161 స్టేట్​మెంట్ అధికారికంగా తీసుకున్నారు. జరిగిన సంఘటనంతా..కాకాణి గోవర్ధన్ రెడ్డి గొప్పతనాలన్ని చెప్పాను. అన్ని 161 స్టేట్​మెంట్​ లో ఓపిక గా రికార్డు చేసుకున్నారు. దాదాపు 2 గంటల సమయం గడిపాము. నెం1 ఫేక్ డాక్యుమెంట్ కేసు ఆయన మీద నేను పెట్టినని ఆయన తప్పించుకోలేడు క్రిమినల్ కేసు, క్రిమినల్ డిఫేమెషన్, సివిల్ డిఫేమెషన్ మూడింటిలో తప్పించుకోలేడు. ఈ కోర్టు ఫైల్ దొంగతనం కేసు కోర్టు ప్రస్టేజిది. 17 కోట్లల్లో 20 వేల ఫైళ్లలో.. అందులో కాకాణి ఫైలే దొంగలెత్తుకెళ్లారంటే అందరికి తెలిసిన విషయం అందుకని.. ఈ రెండు కేసుల్లో శిక్ష పడుతుంది.-సోమిరెడ్డి,మాజీ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details