మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని నెల్లూరు జిల్లా వెంకటాచలం సత్రం పోలీసులు విచారిస్తున్నారు. గత నెలలో ఇమిడేపల్లి భూవివాదంలో ఆయనపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో సోమిరెడ్డిని ఆరా తీస్తున్నారు. ఆయన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారన్న వార్తతో వెంకటాచలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా కార్యకర్తలు పీఎస్ పరిధిలో గుమిగూడారు. అప్రమత్తమైన పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
వెంకటాచలంలో ఉద్రిక్తత..పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సోమిరెడ్డి - పోలీస్‌స్టేషన్‌లో సోమిరెడ్డి
మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇమిడేపల్లి భూవివాదంలో ఆయనపై ఆగస్టులో కేసు నమోదైంది.
సోమిరెడ్డిని వెంకటాచలం పోలీసులు అరెస్ట్ చేశారా!