నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 41,678 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో జలాశయం 3 గేట్లు ఎత్తి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయంలో ప్రస్తుత నీటినిల్వ 74 టీఎంసీలకు చేరింది.
సోమశిల జలాశయానికి భారీగా వరద.. దిగువకు నీరు విడుదల - సోమశిల జలాశయం వరద వార్తలు
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 78 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
![సోమశిల జలాశయానికి భారీగా వరద.. దిగువకు నీరు విడుదల Somasila project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9272465-481-9272465-1603366727257.jpg)
Somasila project
సోమశిల పూర్తి నీటి నిల్వ 78 టీఎంసీలు. వరద కొనసాగుతుండడంతో.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి :'తప్పులు సరి చేసి నూతన జాబితా విడుదల చేయండి'