ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి గుంతలో నాగుపాములు - అరవపాలెంలో నీటి గుంతలో నాగుపాములు

నీటి గుంత నుంచి దుర్వాసన వస్తుందని గుంతలోకి తొంగి చూశారా రైతులు. అక్కడ చూస్తే శునకం మృతదేహం కనిపించింది. దాన్ని పూడ్చి పెట్టేందుకు కిందికు దిగబోతే పాములు కనిపించాయి. తరువాత ఏం జరిగిందో చదివేయండి...

snakes in aravapalem
అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు

By

Published : Jan 28, 2020, 6:41 PM IST

అరవపాలెం నీటి గుంతలో నాగుపాములు
సంగం మండలం అరవపాళెంలో మిరపతోటకు నీరు పెట్టుకునేందుకు ఓ నీటి గుంతను తవ్వారు అక్కడి రైతులు. ఆ గుంత నుంచి దుర్వాసన రావటంతో... అందులోకి తొంగి చూశారు. కుక్కపిల్ల మృతదేహం కనిపించగా పూడ్చేందుకు సిద్ధమయ్యారు. గుంతలోకి అడుగుపెట్టగానే బుసలు కొడుతూ రెండు నాగుపాములు పైకి లేచాయి. అంతే... ఆ రైతు పైప్రాణాలు పైనే పోయాయి. పాములు బయటకు తీసే ధైర్యం లేక, వాటిని దైవంగా భావించి చంపకుండా వదిలేశామని రైతులు చెప్పారు. ఆ పాములను గుంతలోనుంచి బయటకు తీసి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details