Snake bite: నెల్లూరు జిల్లా కొండాపురం బీసీ వసతిగృహంలో పదో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ప్రస్తుతం కలిగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాత్రి వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి జయరాజ్ నిద్రపోతుండగా.. అతడి ఛాతీపై రక్తపింజర కాటు వేసింది. వెంటనే హాస్టల్ వాచ్ మ్యాన్, తోటి విద్యార్థులు కలిసి పామును చంపేశారు. వెంటనే జయరాజ్‌ను కలిగిరి ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ చుట్టూ పరిసరాలు సరిగాలేవని.. తరచూ విష సర్పాలు వస్తుంటాయని విద్యార్థులు చెబుతున్నారు.
Snake bite: వసతి గృహంలో విద్యార్థికి పాముకాటు! - నెల్లూరులో విద్యార్థిని కాటేసిన పాము
Snake bite: విజయనగరం జిల్లా కురుపాంలోని గురుకుల పాఠశాల వసతి గృహంలో పాటుకాటుకు గురై విద్యార్థి మరణించిన ఘటన మరవక ముందే.. రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కొండాపురం బీసీ వసతిగృహంలో.. ఓ పదో తరగతి విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ప్రస్తుతం కలిగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నెల్లూరు బీసీ వసతి గృహంలో పాము కాటుకు గురైన విద్యార్థి