నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మినగల్లు సమీపంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉండడం అక్రమార్కులకు వరంగా మారింది. పట్టపగలే జేసీబీ సాయంతో కొందరు యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కరోనా నియంత్రణతో పాటు ఇసుక అక్రమ రవాణాపైనా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
లాక్‌డౌన్ మాటున ఇసుక అక్రమ రవాణా - sand illegally Transportation
కరోనా ప్రభావం.. లాక్‌డౌన్ నిబంధన.. ఇవేవీ అక్రమార్కులకు పట్టడం లేదు. నెల్లూరు జిల్లాలో పలువురు ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. అధికారులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై దృష్టి పెట్టడం వల్ల వీరి దందా యథేచ్చగా సాగుతోంది.
లాక్‌డౌన్ మాటున భలే చాన్స్..!