నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం భైరవరం కాలనీలో జరిగిన హత్య ఘటనలో.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెంకటగిరి డీఎస్పీ భవాని శ్రీహర్ష వెల్లడించారు.. తాగునీటి నిర్వహణ విషయంలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు.. మరుసటి రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన డీఎస్పీ.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
హత్య ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్టు - వెంకటగిరి నేటి వార్తలు
నెల్లూరు జిల్లా భైరవరంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులైన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
హత్య ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్టు