Simhapuri Sthree Sakthi at Nellore :బాబు మళ్లీ రావాలంటే, ప్రజల కష్టాలు తీరాలంటే మహిళా శక్తి కృషి చేయాలని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, మహిళలకు స్వేచ్ఛలేదంటూ సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదికపై వక్తలు ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు నగరంలో సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందని. మహిళలకు స్వేచ్ఛ లేదని. మళ్లీ టీడీపీ ప్రభుత్వంలోకి రావాలని. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడే మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తారని చెప్పారు. జగన్ పాలన అంతమైనప్పుడే ధైర్యంగా మహిళలు తిరగగలరని వక్తలు ప్రసంగించారు.
'జే బ్రాండ్'తో పేదల ప్రాణాలు తీస్తున్నారు - మహిళలు జాగృతమైతేనే మార్పు : సోమిరెడ్డి
EX- Minister Somireddy Chandramohan Reddy in Simhapuri Sthree Sakthi Meeting :సీబీఎన్ ఫోరం సింహపురి స్త్రీ శక్తి చర్చా వేదికలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని అన్నారు. మహిళల కోసం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణం చేశారని తెలిపారు. జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తానన్నాడని కానీ చెయ్యకుండా జనాలతో విషపూరిత మద్యం తాగిస్తున్నాడని మండిపడ్డారు. జే బ్రాండ్ లతో పేద కుటుంబాల్లో భర్తల ప్రాణాలు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీ బిడ్డను అంటూ ముఖ్యమంత్రి జగన్ మగవాళ్ళను హింసలు పెట్టి, కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఆడబిడ్డలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు.