ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిద్ధార్థ దేవేందర్‌ మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు - సిద్ధార్థ దేవేందర్‌ మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు

బెంగళూరుకు చెందిన సిద్ధార్థ దేవేందర్‌ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన సిద్దార్థ మృతదేహాన్ని బెంగుళూరు, నెల్లూరు పోలీసులు వెలికితీశారు.

Siddhartha Devender dead body found
సిద్ధార్థ దేవేందర్‌ మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు

By

Published : Feb 2, 2021, 4:19 PM IST

నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన బెంగళూరుకు చెందిన సిద్ధార్థ దేవేందర్‌ మృతదేహాన్ని బెంగుళూరు, నెల్లూరు జిల్లా పోలీసులు వెలికితీశారు.​ పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకేసు నిందితుల్లో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించగా, వారిలో ఒకరు మృతి చెందారు. మృతదేహాన్ని చూసిన సిద్ధార్థ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరొకరు తీవ్ర గాయాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ తిరుపతి వాసులే కావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవిల్లో భాగంగానే హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:కర్ణాటకలో హత్య.. రాపూరు అడవుల్లో మృతదేహం

ABOUT THE AUTHOR

...view details