ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా ఎస్సై అత్యుత్సాహం... విలేకరిపై దాడి..! - మహిళా ఎస్​ఐ అత్యుత్సాహం...పాత్రికేయుడిపై దాడి !

విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయునిపై మహిళా ఎస్సై లాఠీ ఝళిపించిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మహిళా ఎస్సై అత్యుత్సాహం... విలేకరిపై దాడి..!
మహిళా ఎస్సై అత్యుత్సాహం... విలేకరిపై దాడి..!

By

Published : May 4, 2020, 9:28 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మహిళా ఎస్సై రోజాలత అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న ప్రసాద్ అనే విలేకరునిపై లాఠీ ఝళిపించారు. లాక్​డౌన్ నేపథ్యంలో గ్రీన్​జోన్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితులపై విజువల్స్ తీస్తుండగా ఆయనపై దాడి చేశారు. ఘటనపై బాధితుడు ఆత్మకూరు సర్కిల్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఆయన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రి స్పందన

ఈ ఘటనపై మంత్రి గౌతమ్​రెడ్డి స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details