ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సై నన్ను మోసం చేశాడు.. న్యాయం చేయండి' - నెల్లూరు జిల్లాలో బాలికను మోసం చేసిన ఎస్సై వార్తలు

మాయమాటలు చెప్పి ఓ ఎస్​ఐ తనను లోబరచుకున్నాడని నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటోంది.

si cheating a girl in nellore district
మైనర్​ను మోసం చేసిన ఎస్సై

By

Published : Aug 19, 2020, 5:24 PM IST

Updated : Aug 19, 2020, 5:41 PM IST

మాయమాటలు చెప్పి ఓ ఎస్​ఐ తనను లోబరుచుకున్నాడని నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక ఆరోపించింది. బిట్రగుంట పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్​ఐ భరత్ కుమార్ తనను మోసగించాడంటూ సదరు బాలిక ఆరోపించింది.

మైనర్​ను మోసం చేసిన ఎస్సై

ఆమె మాట్లాడుతూ.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఆ ఎస్​ఐ తనకు మాయమాటలు చెప్పేవాడని తెలిపింది. ఆ విధంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచుకున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి విషయం ఎత్తితే తనకు సంబంధం లేదనటంతో.. 3 నెలల క్రితం దిశ పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టినట్లు చెప్పింది. ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారే తప్ప తమకు ఎలాంటి న్యాయం చేయలేదని బాలిక పేర్కొంది. ఇప్పుడు ఆ ఎస్సై తమను బెదిరిస్తున్నాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బాలికకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. ఆమెకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరాజు చెప్పారు.

నేను పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఎస్సై మాయమాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు. అప్పటినుంచి నన్ను వేధించడం మొదలుపెట్టాడు. అవి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాను. దీనిపై దిశ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినప్పటికీ నాకు న్యాయం జరగలేదు. ఆ ఎస్సైను అరెస్ట్ చేయలేదు. నాకు న్యాయం కావాలి -- బాలిక

ఇవీ చదవండి..

కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్

Last Updated : Aug 19, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details