కరోనా సోకిన కుటుంబాలను చూసి ఎవరూ భయపడనవసరం లేదని, వారిని చిన్న చూపుగా చూడొద్దని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి నెల్లూరులో అన్నారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, డాక్టర్లతో కలిసి మంత్రులు పరిశీలించారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దనే ఉండాలన్నారు.
'కరోనా బాధితులపై చిన్న చూపు వద్దు' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. కరోనా బాధితులను చిన్న చూపు చూడవద్దని ప్రజలకు సూచించారు. అలాగే లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు.
minister anil kumar